కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… ఉప ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆరెఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడ అమలు కావు ఆన్లైన్ లో ఉండవు. దేశం లో అవినీతి లో మొదటి స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఈటల రాజేందర్ రాజీనామా తో సీఎంఓ అఫీస్ లో ఎస్సీ అధికారులను తీసుకొని జై భీం అంటున్నాడు. కేవలం హుజూరాబాద్ లో ఈటల పై గెలువడనికి దళిత బందు పేరుతో మళ్ళీ మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ అని తెలిపారు. అన్ని జిల్లాల్లో వేల ఎకరాల భూమి ఉంది దళితులకు ఎందుకు ఇవ్వడం లేదు. ఇంటింటి కి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అన్నారు.
అయితే తెలంగాణ వచ్చిన తరువాత ఎవరయినా ధనికులు అయ్యారంటే అది సీఎం కేసీఆర్ అండ్ మెగా కృష్ణ రెడ్డి మాత్రమే. రాష్ట్రం లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల పీఆర్సీ ప్రైవేట్ టీచర్లకు ఆర్టీసి ఉద్యోగులకు ఓట్ల కోసం మోసం చేసింది కేసీఆర్. హుజూరాబాద్ కు ప్రచారానికి వస్తున్న నాయకుల నియోజక వర్గాల్లో ఎటువంటి అభివృద్ది జరుగలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కి బుద్ది చెప్పి కుటుంబ పాలన అంతం చేయడానికి మంచి అవకాశం అని పేర్కొన్నారు.