Etela Rajender: నేను చేరింది రైటిస్ట్ పార్టీలో కాదు రాజకీయ పార్టీలో అని మల్కాజిగిరి పార్లమెంట్ మల్కాజ్గిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎవరూ తిట్టవద్దు అని కోరుకుంట అని నా వీక్ నేస్ అన్నారు. ఎవరు నన్ను విమర్శించకుండా చూసుకుంటా అది నా బలహీనత అన్నారు. నేను చేరింది రైటిస్ట్ పార్టీలో కాదు ఒక రాజకీయ పార్టీలో. నేను చేరింది మంచి పరిపాలన అందించే పార్టీలో అన్నారు. మోడీలో నచ్చిన విషయం ఆయన జీవితాన్ని దేశంకోసం అంకితం చేయడం, ఆయన త్యాగమూర్తి అన్నారు. ఇలాంటివారికి ప్రజాసేవ తప్ప వేరే ఫిలాసఫీ ఉండదన్నారు. నేను డబ్బును, మద్యంను, కుట్రను నమ్ముకున్న వాన్ని కాదన్నారు. ప్రజల కన్నీళ్లు, ఆకలి, దుఖాన్ని స్వయంగా అనుభవించిన వాన్ని.. అదే నా మెరిట్ అని తెలిపారు. నేను పొలిటికల్ పిచ్చొన్ని.. నాకు ప్రజాసేవ తప్ప వేరే యావగేషన్ లేదన్నారు. డబ్బు సంస్కృతినీ, నీచరాజకీయ సంప్రదాయాలను తొక్కివేసి నాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో నాకు వచ్చిన సన్మానపత్రాల్లో తెలుగు విశ్వవిద్యాలయ డైరెక్టర్ కొండల్ రావు ఇచ్చినది, నా జీవితాన్ని ధన్యం చేసిందనన్నారు. మా పోరగాడు అసెంబ్లీలో తెలంగాణ పోరాటాన్ని ఆవిష్కరించాడు అని ఆయన రాశాడు.
Read also: Fake ID Card: నకిలీ గుర్తింపు కార్డుతో అక్రమ వసూళ్లు చేస్తున్న కేటుగాడు..!
నేను ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డను. 1976 లో ఇక్కడ హాస్టల్ లో ఉన్న.. అప్పుడు నా మెస్ చార్జీలు నెలకు 40 రూపాయలన్నారు. ఆకలిని అనుభవించిన వాన్ని. సరిపోయేంత బువ్వ కావాలని ప్లేట్ గ్లాస్ పట్టుకొని ఎనిమిదవ తరగతిలోనే ధర్నాలు చేసిన వాన్ని అన్నారు. మాకు కులం, మతంతో సంబంధం లేదన్నారు. రాజకీయనాయకున్ని అని గర్వంగా చెప్తున్నా అన్నారు. రాజకీయ నాయకుడు ప్రోగ్రెసివ్ గా ఉండాలన్నారు. మంచి నాయకుడికి అవమానాలు ఉంటాయన్నారు. నల్లగొండ జిల్లా వారికి ఎవరిని అయినా మెప్పించి ఒప్పించే నేర్పు ఉంటుందన్నారు. పేరుకే ఎల్బీ నగర్ కానీ ఇది నల్లగొండకు ప్రతిరూపం అన్నారు. నాకు ఇక్కడ వేలమందితో సంబంధం ఉందన్నారు. ఈటలకి ఏం సంబంధం అని సీఎం మాట్లాడుతున్నారు. నా స్కూల్ కేశవ్ మెమోరియల్, నా జూనియర్ కాలేజీ అలియబాద్, నా డిగ్రీ కాలేజ్ సైఫాబాద్ సైన్స్ కాలేజీ.. నేను 32 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నా అన్నారు.
Read also: Telangana Student: అమెరికాలో జెట్‌స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!
ప్రజల ఆశీర్వాదము పదవులు.. నాయకులు ప్రజల సేవకులు అన్నారు. అందుకే బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ చెమట పైసలు వృథా కానివ్వం అని చెప్పిన అన్నారు. మోడీ భారత కీర్తిపతాక ప్రపంచపటం మీద ఎగురవేశారన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రపతిని అవమానించిన అమెరికా ఈ రోజు మనకు రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు. థట్ ఈస్ ఇండియా నౌ.. అందుకే మోడీ అంటే నాకు ఇష్టం అన్నారు. 1957 లో 75 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు 150 విమానాశ్రయాలు అయ్యాయన్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో గొప్ప పురోగతిని సాధించామన్నారు. 2జీ స్కాం, కోల్ స్కాం, బోఫోర్స్ స్కాం ఇలాంటివి ఇప్పుడు లేవన్నారు. ఆయన మచ్చ తెలీదన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి అయిన కష్టం వస్తే తీర్చే సత్తా భారత్ కి ఉంది.. కానీ భారత్ కి కష్టం వస్థే తీర్చే సత్తా ఏ దేశానికి లేదన్నారు. నేను డబ్బును, మద్యంను, కుట్రను నమ్ముకున్న వాన్ని కాదన్నారు. ప్రజల కన్నీళ్లు, ఆకలి, దుఖాన్ని స్వయంగా అనుభవించిన వాన్ని. అదే నా మెరిట్ అన్నారు. 2008 లో 17 మంది పోటీ చేస్తే గెలిచింది 7 మంది అందులో నేను ఒకన్ని. 2004 కాంగ్రెస్ పొత్తు కంటే 5వేల ఓట్లు ఎక్కువ అన్నారు.
Read also: NBK 109 : బాలయ్య మూవీలో మరో మలయాళ హీరో.. ఎవరంటే..?
2009లో 50 మంది పోటీ చేస్తే 10 మంది గెలిచనం అన్ఆనరు. నన్ను ఎప్పుడు వేల మెజారిటీతో గెలిపించారన్నారు. 2021 లో హుజురాబాద్ ప్రజలు ధర్మాన్ని గెలిపించి చరిత్ర తిరగరాశారన్నారు. కరోనా సమయంలో మొట్టమొదటి పేషంట్ దగ్గరికి వెళ్లేవాన్ననని, చైతన్యవంతం అయిన ఈ ప్రాంతంలో ధర్మానికి పట్టం కడతారని వచ్చా అన్నారు. నేను మీకు మచ్చ తేను.. నేను పొలిటికల్ పిచ్చొన్ని. నాకు ప్రజాసేవ తప్ప వేరే యావగేషన్ లేదు..డబ్బుతో ఎన్నికలు నడపాలి అనే దుష్ట సంప్రదాయం కేసీఆర్ తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయమంటే వ్యాపారమా? దేనికోసం రాజకీయం అంటూ ప్రశ్నించారు. మల్కాజిగిరి పార్లమెంట్ రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ.. ఇక్కడ ఉన్న ప్రజలు ప్రశాంతత కోరుకుంటారని తెలిపారు. మోడీ వచ్చాక బాంబుల మోతలు లేవన్నారు. ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించారని, 500 ఏళ్లకింద ధ్వంసం అయిన రామమందిరాన్ని నిర్మించి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన వారు మోడీ అన్నారు. డబ్బు సంస్కృతికి, నీచ రాజకీయ సంప్రదాయాలను తొక్కివేసి నాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
No Holidays: స్కూల్స్ కు సెలవులు వద్దంటూ విద్యార్థి లేఖ..!