తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదు అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్.. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచారణకు సైతం ఆదేశించారు సీఎం కేసీఆర్.. అయితే, ఈ పరిణామాల తర్వాత వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని ప్రకటించారు.. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు..…
ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్‌ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం…