Etela Rajender Challenges CM KCR: కొంతకాలం నుంచి మౌనం పాటిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పాలనలో పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయిస్తూ.. వారు మాత్రం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో ప్రజా ప్రతినిధులు, ప్రెస్ మిత్రులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. తమవారిని కాపాడుకునే క్రమంలో.. ప్రజలు మీపై దాడికి దిగే సమయం కూడా వస్తుందని హెచ్చరించారు. దశాబ్ది వేడుకల కారణంగా విద్యార్థి చనిపోయాడు కాబట్టి.. అతని కుటుంబాన్ని మీరే ఆదుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Revanth Reddy: అమర వీరుల పేర్లు లేకుండా.. స్థూపం ఏంటి?
కేసీఆర్‌కు దమ్ముంటే చర్చించేందుకు స్వయంగా హుజూరాబాద్ రావాలని, సైకోలను పంపించడం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం ద్వారా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రూ.10 లక్షలు పూర్తిగా రాలేదని, వెంటనే పూర్తిగా దళిత బందు ఇవ్వాలని కోరారు. బీసీ బందు కేవలం ఎలక్షన్ల కోసమేనన్న ఆయన.. బీజీలకు ఇచ్చినట్లు అన్ని కులాల వారికి కూడా రూ.1 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమని, అదేం నీ జాగీరు కాదని విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ కూడా ప్రజల సొమ్ముతో కట్టిందేనన్నారు. నిరుద్యోగ యువకులు, మహిళలు, రైతులు, మేధావుల కళ్లల్లో ఈ ప్రభుత్వం కట్టి కొట్టిందని.. అందరూ ఓసారి ఆలోచించాలని సూచించారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఉద్యమ కారులపై రాళ్లు రువ్వి దౌర్జన్యం చేసిన వ్యక్తే.. ఇప్పుడు పదవిలో ఉన్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
Komatireddy Venkat Reddy: బండి సంజయ్, జాగ్రత్త.. కోమటిరెడ్డి వార్నింగ్