Election Code: కొందరు ఇతరులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. మరికొందరు ఆ పోస్టులపై కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో చాలా మంది పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగితే నిప్పులు చెరుగుతుంది. మీ చేతిలో ఫోన్ ఉందని సోషల్ మీడియాలో చిన్న వ్యాఖ్య చేశారా? ఒకరి పోస్ట్ మీకు నచ్చలేదు కాబట్టి మీరు దానిని తీవ్రంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం తథ్యం. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వారు పోస్ట్‌ల క్రింద కామెంట్‌లు పోస్ట్ చేసే వారిపై నిఘా పెట్టనున్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో దాదాపు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారానికి సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాలను పార్టీ నేతలే కాకుండా పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లో వివిధ పేర్లతో వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఆయా పార్టీల అనుచరులు స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం. ఈ గౌరవం మా నాయకుడికే దక్కుతుంది.. ఇలాంటివి ఎన్నో చేశాం.. ఇంకా ఎన్నో చేస్తాం.. అభివృద్ధి కోసం చేద్దాం.. అంటూ పోస్టులతో మండిపడుతున్నారు. ఇలాంటి వాటికి ఆయా పార్టీల అనుచరులు అవుననే చెబుతుంటే.. ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇవి కొన్ని సందర్భాల్లో కట్టు తప్పి, వ్యక్తిగత విమర్శలకు దారితీస్తూ అదుపుతప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణ సమయంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ ల కేసులకు, ఎన్నికల సమయంలోన మోదైన కేసులకు చాలా తేడా ఉంటుందని అంటున్నారు. ఎన్నికల వేళ కఠిన సెక్షన్లు చేర్చి కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర, బాధ కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టవద్దని సూచించారు. వాటిని ఎగిరిపడుతూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తే వారికి కఠినంగా శిక్షిస్తామని, జైలులో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
Bank Holidays : నవంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?