ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు సెలవు ఉంటుంది.. అదే విధంగా నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవులను బ్యాంక్ తాజాగా వెల్లడించింది.. ఇక నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవుల గురించి ఆర్బీఐ విడుదల చేసిన హాలీడేస్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం..
బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను తాజాగా ప్రకటించింది..ఈ ప్రకటనలో నవంబర్‌లో 12 రోజుల సెలవులు ఉంటాయని తెలిపింది.ఏయే రోజు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నవంబర్ 1 – బుధవారం (కరక చతుర్థి, ఈ రోజును జరుపుకోవడానికి భారతదేశం అంతటా బ్యాంకులు మూసి వేయబడతాయి.)
నవంబర్ 5 – ఆదివారం
నవంబర్ 10 – శుక్రవారం (వంగ పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకు సెలవు)
నవంబర్ 11 – రెండవ శనివారం
నవంబర్ 12 – ఆదివారం (దీపావళి కూడా)
నవంబర్ 13 – సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీలో బ్యాంకు సెలవు)
నవంబర్ 15 – బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
నవంబర్ 19 – ఆదివారం
నవంబర్ 24 – శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలో బ్యాంకు సెలవు)
నవంబర్ 25 – నాల్గవ శనివారం
నవంబర్ 26 – ఆదివారం
నవంబర్ 27 – సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకు సెలవు)..
మీకు బ్యాంక్ లో ముఖ్యమైన పని ఉంటే ఈరోజులు చూసుకొని పని చేసుకోవడం మంచిది.. లేకుండా తీవ్ర నష్టాలను చవి చూడాలి..