ED Raids: రెండవ రోజు ఈడీ సోదాలు.. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్‌లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే పలు మెడికల్ కాలేజీలలో సోదాలు ముగియగా.. మరికొన్ని చోట్ల రెండవ రోజు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరగనున్నాయి.
Read also: Pailla Shekar Reddy: పైళ్ల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ.. ఆ పత్రాలు అందించిన అధికారులు
Also Read
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నిన్న (బుధవారం) ఉదయం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్కాన, చౌటుప్పల్, జడ్చర్ల, చేవెళ్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, సమీర్ పేట్‌కు ఈడీ బృందాలు వెళ్లాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో పలుచోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఎస్‌విఎస్ మెడికల్ కాలేజీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ శాఖలతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 6 జిల్లాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాలేజీల ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలను పరిశీలించారు.
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..