Telangana DSC: తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ..
- తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది...
- డీఎస్సీ పరీక్షకు మొత్తం 2
- 79
- 956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DSC: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసి టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతే స్కూల్ అసిస్టెంట్‌లో రెండు మెథడాలజీ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
Read also: Italy Water Crisis : ఇటలీలో తీవ్ర నీటికొరత… దయచేసి పర్యాటకులు తమ దేశానికి రావొద్దని విజ్ఞప్తి
Also Read
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ఆ లెక్కన ఒక్కో పోస్టుకు దాదాపు 25 మంది పోటీ పడుతున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులు రాగా, నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. 5శాతం స్థానికేతర కోటా ఉండడంతో ఇతర జిల్లాల వారు కూడా హైదరాబాద్ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. మేడ్చల్ జిల్లా నుంచి 2,265 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు వచ్చాయి. డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో టెట్‌లో అర్హత సాధించిన వారిలో 23,919 మంది ఫీజు చెల్లించకుండానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Aravind Kejriwal : 8కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళన వ్యక్తం చేసిన ఆప్
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!