HYD Metro: మెట్రో స్టేషన్ల కిందే సిట్టింగ్.. అడ్డంగా బుక్కైన మందుబాబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Metro: నగరంలో మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో పబ్లిక్ ప్లేసులే అడ్డాగా మార్చుకుంటు మందు కొడుతున్నారు. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ మెట్రో, జనావాసాల్లో మందు తాగుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చిన్న వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరంలోని ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణించే కుటుంబాలకు ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే ఇలాంటి మెట్రో స్టేషన్లు కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డంకులుగా మారుతున్నాయి. యువ జంటల లిఫ్ట్‌లో టిక్ టాక్ డ్యాన్స్‌లు, ఇన్‌స్టా రీల్స్, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి ఘటనలు మహానగరాల్లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభ్యర్థన మేరకు మెట్రో అధికారులు ఇలాంటి మోసాలపై సీరియస్‌గా చర్యలు తీసుకుని తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.
Read also: Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఇదిలా ఉండగా మెట్రో స్టేషన్ల పరిధిలో మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పంజాగుట్ట మెట్రో స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు పట్టపగలు గ్లాసుల్లో మందు కలిపి దర్జా తాగుతున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది మరిచిపోకముందే యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ పరిధిలో కూడా కొందరు యువకులు పట్టపగలు డ్రగ్స్ సేవిస్తున్నారు. స్టేషన్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన బెంచీల మీద దర్జాగా కూర్చున్నాడు. మెట్రో స్టేషన్లంటే పర్మిట్ రూమ్స్ అని భావించి సిగ్గు లేకుండా మందు కొడుతున్నారు. పక్కనే గుడి ఉన్నప్పటికీ.. అటుగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీరువా తాగి చల్లబరుస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర వైన్స్, బార్లు ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్ల కింద కూర్చున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే బాలికలతో పాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, కుటుంబ సమేతంగా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!