మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు.
టీవీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సులో పరిచయం అయిన మేకప్ ఆర్టిస్ట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశాడు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్) బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 42 వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించాయి.