CM Revanth Reddy: నేడు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన రైతుల పండగ సభ ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. రైతు పండగ ముగింపు సభలో సీఎం హాజరై ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చేరుకుంటారు. సమీపంలోని రైతు పండగ సదస్సును సందర్శించి స్టాళ్లను పరిశీలించనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Read also: Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
సీఎం రానున్న నేపథ్యంలో.. సభా ప్రాంగణం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బందిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో మహబూబ్ నగర్ ఎస్పీ జానకి పూర్తి బందోబస్తును పర్యవేక్షించారు. ఐజీ ఎప్పటికప్పుడు సీనియర్ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. కాగా..పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఆరుగురు ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు, 58 మంది ఎస్‌ఐలు, 91 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 700 మంది కానిస్టేబుళ్లు, 139 మంది మహిళలు, 174 మంది పురుష హోంగార్డులకు విధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Read also: Astrology: నవంబర్ 30, శనివారం దినఫలాలు
అంతేకాకుండా.. ఎనిమిది రోప్ పార్టీలు, ఎనిమిది స్పెషల్ పార్టీలు, ఐదు సీపీటీ బృందాలు, 40 మంది గ్రేహౌండ్స్ పోలీసు బలగాలను నియమించారు. కాగా.. ట్రాఫిక్ మళ్లించేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల నుంచి 267 మందిని తీసుకొచ్చారు. ట్రాఫిక్ మళ్లింపుకు ప్రత్యేకంగా ఇద్దరు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు సీఐలు, 27 మంది ఎస్‌ఐలు, 37 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 199 మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇక మహబూబ్‌నగర్, భూత్పూర్ రహదారులతో పాటుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకుని వాహనదారులు వేరే రూట్లలో పయనించాలని సూచించారు.
IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా