తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 29 నవంబర్ 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజని, తెలంగాణ ఉద్యమగతిని ఆరోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని టీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవులను తృణ ప్రాయంగా వదిలేసి పోరాట బాట పట్టిన గొప్ప యోధుడు కేసీఆర్ అని కొనియాడారు.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చేందుకు టీర్‌ఎస్‌ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేసిన మహానేత కేసీఆర్ అన్నారు. 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చారిత్రాత్మకమైందని తక్కెళ్లపల్లి అన్నారు. కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అహార్నిశలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీవి చిల్లర రాజకీయాలని బీజేపీ మాటలు విని రైతులు మోసపోవద్దని వానకాలం పంటను రాష్ర్టప్రభుత్వమే కొంటుందని తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు.