తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 29 నవంబర్ 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజని, తెలంగాణ ఉద్యమగతిని ఆరోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని టీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవులను తృణ ప్రాయంగా వదిలేసి పోరాట బాట పట్టిన…