Sangareddy Crime: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి మండలం కోత్లాపూర్ జ్యోతిబాపులే గురుకులంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి గురుకుల పాఠశాలలో స్వాతి అనే విద్యార్థిని 9వ తరగతి చదువుకుంటుంది. స్వాతి స్వస్థలం లింగంపల్లి. అయితే ఇవాళ ఉదయం గదిలో నుంచి స్వాతి ఎంతకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గురుకుల సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీంతో గురుకుల సిబ్బంది, వెంటనే పోలీసులకు, స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు, పోలీసులు చేరుకున్నారు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్వాతి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని ఆరోపించారు. స్వాతి కుటుంబ సభ్యులకు పోలీసులు ఆందోళన విరమించాలని కోరారు. అయితే న్యాయం జరిగేంత వరకు స్వాతి మృత దేహాన్ని కదలించేది లేదని తెలిపారు.
Read also: Sreeleela : అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన శ్రీలీల
ఈ ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య మాట్లాడుతూ.. గురుకులంలో ఉదయం ఆరు గంటలకు విద్యార్థిని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఘటన సమయంలో హాస్టల్ వార్డెన్ లేదనే విషయం విద్యార్థులు చెబుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని, స్వాతి ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. విద్యార్థిని కొంచం డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. విద్యార్థిని మృతి కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. స్వాతి గదిలో వెళ్లి ఊరి వేసుకుంది.. అయితే ఆ సమయంలో తోటి విద్యార్థినులు ఎక్కడ వున్నారనే దానిపై ఆరా తీస్తుననారు. హాస్టల్ వార్డెన్ లేదని విద్యార్థినిలు తెలిపారు.. అయితే వార్డెన్ గురుకుల బాధ్యతలు ఎవరికి అప్పగించారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Allergy: అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు