TSPSC Group-3: రేపటి నుంచే గ్రూప్–3 పరీక్షలు.. రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ ..
- ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు..
- ఈ మేరకు తెటీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి..
- మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group-3: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్షలు నిర్వహిస్తారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.పేపర్-3 పరీక్ష 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.
Read also: Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
Also Read
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేసి నేరుగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్-3 అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్ల గేట్లను మూసివేస్తామని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు మరియు ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచుకోవాలని TGPSC సూచించింది. డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవు.
Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..
తాజావార్తలు
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..