మానవులు లేదా జంతువులలో అలెర్జీలు చాలా సాధారణం. ఈ వింటర్‌లో అలర్జీలు పెరిగే అవకాశం ఉంటుంది.
పర్యావరణం, కొన్ని ఆహారాలు, వాతావరణం లేదా మందులు వంటి అనేక కారణాల వల్ల అనేక రకాల అలెర్జీలు తలెత్తుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ఇంట్లో పెట్స్ ఉంటే వాటిని పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం తగ్గించాలి. పెట్స్‌ను బెడ్‌రూమ్‌లోకి రాకుండా చూసుకోవాలి.
ఒకవేళ పెట్స్‌తో ఆడినప్పుడు స్నానం చేయడం, దుస్తులు మార్చుకోవడం తప్పనిసరిగా చేయాలి. ప్రతి వారం పెట్స్‌కి స్నానం చేయించాలి.
బెడ్‌షీట్స్‌ని వారానికోసారి వేడినీళ్లలో శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లో ఫ్లోరింగ్, వుడ్ ఫర్నిచర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం వల్ల బెడ్ మూలల్లో ఉండే డస్ట్ మైట్స్ పోయేలా చేసుకోవచ్చు.
కార్పెట్ ఉంటే కనుక తీసివేయడం ఉత్తమం. ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్లు కార్పెట్ వాడకుండా ఉండాలి.
కిటికీ కర్టెన్లను వారానికోసారి ఉతకాలి. షెల్ఫ్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.