DCP Srinivas started ACP office: మహేశ్వరం నూతన డీసీపీ, ఏసీపీ కార్యాలయాలను డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్థానికుల సౌకర్యార్థం రాచకొండ కమిషనరేట్ పరిధి మహేశ్వరం డీసీసీ, ఏసీపీ కార్యాలయాలను తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగిందని డీసీసీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రజలందరికీ మా కార్యాలయం అందుబాటులో ఉంటుందని అందరు వినియోగించుకోవాలని సూచించారు. మహేశ్వరం జోన్ లోని ప్రజలందరు ఏలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని అన్నారు. ఇప్పుడు ప్రారంభించిన కార్యాలయాలు అద్దెకు తీసుకున్నామని త్వరలో పూర్తి స్థాయి భవనాలను ప్రభుత్వ చొరవతో ప్రారంభిస్తామని తెలిపారు.
Read also: Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్‌తోపాటు మరింత మంది
జనవరి 31. 2023న మహేశ్వరం డీసీపీ కార్యాలయానికి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్‌ను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయ పరిధిలో మహేశ్వరం, కందుకూరు పోలీసుస్టేషన్లతో పాటు పహడీషరీఫ్, బాలాపూర్ పోలీసుస్టేషన్లను కలుపుతూ నూతనంగా మహేశ్వరం డీసీపీగా కార్యాలయంగా మార్చడంతో.. డీసీపీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.
Sridevi: ముగ్గురు చెల్లెళ్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’