తెలంగాణ ప్రజలు అవినీతి మంత్రుల భరతం పట్టాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జా కోరులుగా మారారు. కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను మింగేస్తుండ్రు అని దాసోజు శ్రావణ్ అన్నారు. మల్లారెడ్డిపై రేవంత్ ఆధారాలతో ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి ఆరోపణలను ఎదుర్కోడానికి తొడలు, జబ్బలు కొట్టుకుంటూ మాట్లాడిండు. నేను అమాయకుసిని అని అంటుండు.. సిగ్గుచేటు అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారు… మల్లారెడ్డితో ఏమైన కుమ్మక్కయ్యారా అని అన్నారు. అవినీతికి పాల్పడితే కొడుకునైన విడిచిపెట్టా అన్నారు. మరి మల్లారెడ్డిని ఎందుకు వదులుతున్నారు అని ప్రశ్నించారు.
అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ల భరతం పడతాము. కోర్టుకు వెళ్తా, సీబీఐకి వెళతాం. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా. కేసీఆర్ అవినీతి ఆరోపణలు.. మంత్రులు బయట పెడతారనే భయపడుతున్నారా… లేక మల్లారెడ్డి అవినీతిలో వాటా ఉందా అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ అవినీతి మంత్రుల భరతం పట్టాలి అని సూచించారు. ఆధారాలతో మల్లారెడ్డి భాగోతం పై పోరాటం చేస్తాం. బండి సంజయ్ పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండ్రు. ఇటు రేవంత్ పై కూడా ఇష్టం వచ్చినట్లు దుషీస్తున్నారు. గుండ్లపోచం పల్లి లో.. 650 సర్వే నెంబర్ లో 16ఎకరాలు శ్రీనివాస్ రెడ్డికి ఎట్లా ఎక్కింది. ఆ భూమిని మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరు పై రిజిస్ట్రేషన్ చేశారు.1965 -66లో పహాణి 22.8 ఎకరాలు వుంది.. అదేవిధంగా 2020 లో వరకు వుంది. ధరణి కొచ్చేసరికి 33.26 ఎకరాలు ఉన్నట్లు చూపించారు అని తెలిపారు.
Also Read
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
శామీర్ పేట్ లో సీఎంఆర్ హాస్పిటల్ పేరుతో ప్రజల రక్తం తాగుతుండ్రు. ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ ఎట్లా వస్తది. రిజిస్ట్రేషన్ శాఖ కూడా సర్కార్ భూమి అని రిపోర్ట్ ఇచ్చింది. తప్పుడు డాకుమెంట్స్ పెట్టి bhel భూములు నావే నాని నమ్మించే ప్రయత్నం చేసిండు మల్లారెడ్డి. ఆయన ఏమైన కేసీఆర్ అల్లుడా.. లేక తెలంగాణ అల్లుడా. న్యాక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్ లిస్ట్ లో పెడితే.. కేసీఆర్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చిండు. గుండ్ల పోచంపల్లిలోని hmda లేఔట్ లో వున్న పార్క్ నుండి మల్లారెడ్డి హాస్పిటల్ కు రోడ్ వేసుకుండు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు మల్లారెడ్డి కోసమా అని అన్నారు. ఉమ్మడి ఏపీ లో 6మంత్రులపై ఆరోపణలు వస్తే.. అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేంద్రమంత్రులను కూడా వదల్లేదు. మియాపూర్ ల్యాండ్, ఇసుక మాఫియా, నయిం, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో దోపిడీ.. కేసీఆర్ కిట్లు, మందుల కొనుగోళ్లలో దందా చేస్తున్నారు తెలిపారు. ఇక సీఎం కేసీఆర్, మంత్రుల అవినీతిపై ఎక్కడి వరకైనా పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..