Missing Mystery: హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్‌లో ఓ బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోస్టుమార్టం నివేదికలో ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని వైద్యులు వెల్లడించారు. చెరువులో జారిపడిన బాలిక ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు.
Read also: Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు
దమ్మాయిగూడ పరిధిలో బాలిక ఇందు అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. ఈ నెల 15న (గురువారం) ఉదయం 9గంటలకు పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు శుక్రవారం అంబేడ్కర్ నగర్ చెరువులో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. మిస్టరీ వీడేందుకు పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. శాస్త్రీయ ఆధారాలతో పాటు, మానవ మేధస్సును పరిశోధించారు. బాలిక ఇందుకు చెరువులో నీరు తాగేందుకు వెళ్లి కాలు జారీ చెరువులో పడిపోవడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఈకేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఐదురోజుల్లో ఛేదించారు. ఇందు చనిపోయింది ఎవరో ఏదో చేయడం వల్ల కాదని నీటిలో మునగడం వల్లే చనిపోయిందని వెల్లడించి మిస్టరీలో వున్న నిజాలను బయటపెట్టారు. అయితే ఇందు మృతితో దమ్మాయిగూడలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఇందుని చంపి చెరువులో పడేశారంటూ వాదిస్తున్నారు.