ఈడీ సమన్లపై చికోటి ప్రవీణ్ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొన్నారు. రేపు ఈడీకి సమాధానం బెబుతా అంటూ మీడియాకు తెలిపారు. అధికారులకు సందేహాలు ఉన్నాయి, అందుకే వివరణ అడిగారని ప్రవీన్ అన్నారు. గోవా, నేపాల్ క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని ప్రవీణ్ స్పష్టం చేసారు. అయితే.. ఈడీ విచారణలో…
క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ నాదే కానీ.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నగరంలోని బోడుప్పల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే.. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ తనదేనన్న మల్లారెడ్డి, అది 2022 మార్చి నాటిదని చెప్పారు. ఈనేపథ్యంలో..…
చిక్కోడి ప్రవీణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. క్యాసినో వ్యవహారంలో ఈడి సోదాలు ముగిసాయి. అయితే.. Ed సోదాల్లో హవాలా లావాదేవీలు బయట పడ్డాయి. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి ఇళల్లో తెల్లవారుజామున వరకు ఈడి సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించింది. తెలంగాణ లో సైదాబాద్, బోయిన్ పల్లీ, కడ్తల్…