Oneplus Store : గిట్లకూడ ఉంటదా..? రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ తిరిగివ్వమంటే కస్టమర్లకు బెదిరింపులు..
- ఫోన్ అడిగిన కస్టమర్లపై పోలీస్ కేసులు
- "నాకు ఎస్ఐ తెలుసు" అంటూ బెదిరించిన మేనేజర్
- సీసీ కెమెరా పని చేయదన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మేనేజర్ “నేను ఫోన్ చేస్తే రెండు నిమిషాల్లో పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అంటూ కస్టమర్లను బెదిరించినట్లు సమాచారం.
Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం.. ప్రముఖ ఆస్పత్రి ధ్వంసం
Also Read
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
మేనేజర్ ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు సర్వీస్ సెంటర్‌కు చేరుకున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు కస్టమర్లను సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశిస్తూ, “ఇక్కడ న్యూసెన్స్ సృష్టిస్తే మీపై కేసు నమోదు చేస్తాం” అంటూ హెచ్చరించారు. దీనికి కస్టమర్లు, “మేము మా ఫోన్లను తిరిగి ఇవ్వమని అడుగుతున్నామే తప్ప, ఎందుకు బయటకు వెళ్లాలి?” అంటూ ప్రశ్నించారు.
అయినప్పటికీ, నారాయణగూడ ఎస్ఐ వెంకటేష్ కస్టమర్లపై “పోలీస్ విధులకు అడ్డంకి కలిగించారు” అంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సర్వీస్ సెంటర్లోని సీసీ కెమెరా ఫుటేజీని బయటపెట్టాలని కస్టమర్లు డిమాండ్ చేయగా, “సీసీ కెమెరాలు పనిచేయడం లేదు” అంటూ మేనేజర్ సమాధానమిచ్చారు. సర్వీస్ సెంటర్‌పై కేసు నమోదు చేయకుండా, కస్టమర్లపైనే అక్రమ కేసులు పెట్టిన నారాయణగూడ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Extramarital Affair: కూతురి వివాహేతర సంబంధం.. మనవరాళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న అమ్మమ్మ, అవ్వ!
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?