Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్‌లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్‌లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది.…