ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతుంటే.. మరోవైపు.. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ… ఈ వ్యవహారంలో టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. అయితే, ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ముఖ్యమంత్రి జన్మదినం చేస్కోవడంలో తప్పేముంది..? అని ప్రశ్నించారు.. సీఎం బర్త్‌డేకు నిరుద్యోగానికి సంబంధం ఏంటి? అని నిలదీశారు.. ఇక, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు జగ్గారెడ్డి… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే కేసీఆర్‌కు ఇబ్బంది అవుతుందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు.. బీజేపీ మూడో ప్లేస్ లో ఉంటుందని పేర్కొన్నారు.. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదన్నారు జగ్గారెడ్డి.
Read Also: AP COVID 19: మరింత కిందకు రోజువారి కేసులు
ఇక, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీపై స్పందించిన జగ్గారెడ్డి… వెంకట్ రెడ్డి, రేవంత్ కలవడం మంచి పరిణామంగా తెలిపారు.. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో.. ఓటర్లను భయపెడుతూ వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మీద కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు ? అని ప్రశ్నించారు.. నేను ఎక్కువ సమయం నియోజకవర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నానని వెల్లడించారు.. అయితే, ఇవాళ తలపెట్టిన నిరసన ప్రోగ్రాం గురించి నాకు తెలియదన్నారు జగ్గారెడ్డి… వర్కింగ్ ప్రెసిడెంట్ కి చెప్పి చేయాలని రూల్ లేదంటూ.. సొంత పార్టీపై విమర్శలు చేసిన ఆయన.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ డమ్మీ పోస్టుగా చెప్పుకొచ్చారు.