రైతులతో రెండు ప్రభుత్వాలు ఫుట్ బాల్ ఆడుతున్నాయి: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగిలో వరి వేయిద్దనే సీఎం కామెంట్స్ ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో రెండు ప్రభు త్వాలు ఫుట్‌బాల్ ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. వరి పంట కొత్తగా పండించడం లేదు. ప్రణాళికలు వేసుకోవడమే ప్రభుత్వ బాధ్య త అన్నారు. నేను కొనను అంటే ఎలా .. కేంద్రం కొనదు కాబట్టి నేను కొనను .. ఏం చేస్తున్నట్టు అని ఆయన ప్రవ్నించారు. బీజేపీ.. టీఆర్ ఎస్ ఇద్దరూ కలిసి రైతులతో ఆటలాడుతున్నారన్నారు.రైతు పండిం చిన పంట కొనను అనే మాటలు ఎక్కడా వినలేదు. రెండు పార్టీలు రాజకీయాల కోసం రైతులను నాశనం చేస్తున్నాయన్నారు. బండి సంజయ్.. సీఎం అవినీతి తెలుసు అంటారు.. కేసీఆర్..సంజయ్ నేను టచ్ చెయ్ అంటున్నారని ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన విమర్శించారు.
ప్రజలు వారిని పరిశీలించాలని, ఆలోచన చేయాలని భట్టి అన్నారు. ఏడేళ్ల నుంచి నదీ జలాల వాటా ఇవ్వకపోతే ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనమని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఏడేళ్ల నుంచి అద్భు తాలు సృష్టిస్తున్నా అన్నావ్, కేంద్రం గెజిట్ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది నీటివాటాలో.. కేంద్రం అడిగేది ఒకటి..కేసీఆర్ చెప్పేది ఇంకొకటి, అసలు ఎం జరుగుతుంది రాష్ట్రంలోఅని భట్టి విమర్శిం చారు. కేసీఆర్ ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కృష్ణా.. గోదావరి మీద స్పష్టత లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టు పేరు తో ఏపీ నీటి దోపిడీ చేస్తుంది. అది పూర్తియితే సాగర్‌కు నీళ్లు రావు. శ్రీశైలం పై ఆధారపడిన ప్రాజెక్టులు ఎండిపోతాయి ఇరిగేషన్‌పై స్పష్టత లేదు. ఇరిగేషన్ సెక్రటరీ వివరాలు కూడా చెప్పడు అంటూ కేసీఆర్‌పై భట్టి ధ్వజమెత్తారు.
Also Read
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
- TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!