Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
- 41 బార్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు
- హైదరాబాద్‌లో 14 బార్లకు లక్కీ డ్రా
- జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఎంపిక
- విజేతలకు లైసెన్స్ అనుమతి పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బార్ల లక్కీ డ్రా ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. ఆబ్కారీ శాఖ క్యూర్ (TCUR) పరిధిలోని 14 బార్లతో పాటు, వివిధ జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని మరో 27 బార్లు.. మొత్తం 41 బార్లకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ‘లక్కీ డ్రా ఆఫ్ లాట్స్’ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
హైదరాబాద్‌లో కోలాహలం.. దరఖాస్తుదారుల కిటకిట
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ల పరిధిలోని 14 బార్లకు లక్కీ డ్రాని నగరంలోని ‘ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ హాల్’లో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే దరఖాస్తుదారులు హాల్ వద్దకు బారులు తీరారు. ఈ 14 బార్ల కోసం ఏకంగా 4,251 దరఖాస్తులు వచ్చాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యక్షంగా డ్రా ప్రక్రియను చేపట్టారు.
Also Read
ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే వారికి కేటాయించిన నంబర్ల నాణేలను అందరి ముందు ఒకే బాక్స్‌లో వేశారు. సికింద్రాబాద్ ఈఎస్ జీవన్ కిరణ్ బాక్స్‌ను బాగా కుదిపిన అనంతరం, కమిషనర్ హరికిరణ్ చేతితో కాయిన్‌ను తీసి అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషికి అందించారు. ఎంపిక చేసిన నంబర్లను వెంటనే మైకులో ప్రకటించడంతో పాటు పెద్ద స్క్రీన్‌పై డిస్ప్లే చేశారు. ఈ విధంగా 14 దఫాలుగా డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి ఎక్సైజ్ సిబ్బంది వెంటనే బార్ లైసెన్స్ అనుమతి పత్రాలను అందజేశారు.
జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రాలు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 27 బార్లకు మొత్తం 4,519 దరఖాస్తులు వచ్చాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (అశ్వారావుపేట), ఖమ్మం (కల్లూరు), మహబూబ్‌నగర్ (మక్త్, దేవరకద్ర, మద్దూరు, మహబూబ్‌నగర్), సంగారెడ్డి (గడ్డపోతారం, గుమ్మిడాల, కోహీర్), నిజామాబాద్ (బోధన్), కామారెడ్డి (బిచ్కుంద), ఫ్యూచర్ సిటీ (చేవెళ్ల, మొయినాబాద్), వికారాబాద్ (కొండంగల్, పరిగి), వరంగల్ రూరల్ (నర్సంపేట), జనగామ (స్టేషన్ ఘన్పూర్), మహబూబాబాద్ (కేసముద్రం)లతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా తీసి విజేతలను ప్రకటించారు.
భారీ ఎత్తున పోటీ ఉన్నప్పటికీ బార్ల లక్కీ డ్రా ప్రక్రియ ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లక్కీ డ్రా విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన దరఖాస్తుదారులకు, రాత్రింబవళ్లు కష్టపడిన ఎక్సైజ్ అధికారులకు , సిబ్బందికి కమిషనర్ సి.హరికిరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!