Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడే ‘టెస్ట్ ట్వంటీ’ క్రికెట్ టోర్నీ
- నవంబర్ 14 నుంచి 29 వరకు శ్రీలంకలోని కొలంబోలో నిర్వహణ..
- 13 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువ ఆటగాళ్లలకు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెర లేవనుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే జట్టుగా పోటీపడే మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్‌ను అతి త్వరలో నిర్వహించనున్నారు. ‘టెస్ట్ ట్వంటీ’ (Test Twenty) పేరుతో జరిగే ఈ ప్రత్యేక టోర్నీ నవంబర్ 14 నుంచి 29 వరకు శ్రీలంకలోని కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా జరగనుంది. 80 ఓవర్ల వినూత్న ఫార్మాట్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
ఈ టోర్నమెంట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న 160 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని నాలుగు ఖండాల జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో మొత్తం 40 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు ఉంటారు. ఇద్దరి పరుగులను కలిపి జట్టు స్కోరును నిర్ణయించడం ఈ టోర్నీ ప్రత్యేకత.
Also Read
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ప్రతి మ్యాచ్‌ను ఒకే రోజులో పూర్తి చేస్తారు. మ్యాచ్ లో ఒక్కో జట్టు రెండు 40 ఓవర్ల సెషన్లలో రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది. తొలి సెషన్ పగటి సమయంలో సంప్రదాయ తెలుపు దుస్తులు, ఎరుపు బంతితో జరుగుతుంది. రెండో సెషన్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రంగుల దుస్తులు, తెలుపు బంతితో నిర్వహిస్తారు. తొలి సెషన్లో సాధించిన స్కోరు రెండో సెషన్‌కు కొనసాగుతుంది. ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన అంశం ‘పారిటీ రూల్’ (Parity Rule). ఈ నిబంధన ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల స్కోర్ ఫలితాలపై ప్రభావం చూపుతాయి. అమ్మాయిలు సాధించిన స్కోరు ఫ్లడ్‌లైట్ల కింద అబ్బాయిల విజయాన్ని నిర్ణయిస్తే, అబ్బాయిలు సాధించిన స్కోరు అమ్మాయిల ఫలితంపై ప్రభావం చూపుతుంది. టాస్ ఆధారంగా ఈ విధానం మారే అవకాశం కూడా ఉంటుంది.
ఈ టెస్ట్ ట్వంటీ వ్యవస్థాపకుడు, పారిటీ రూల్ రూపకర్త “గౌరవ్ బహిర్వాణి” మాట్లాడుతూ.. మైదానంలోనే కాకుండా టోర్నీ ప్రసారంలోనూ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అమ్మాయిలు, అబ్బాయిలకు సమానంగా ప్రసార కవరేజ్ కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వినూత్న టోర్నమెంట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పేరొందిన మాజీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, సర్ క్లైవ్ లాయిడ్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. గ్లోబల్ సెలక్షన్ కమిటీకి ఢిల్లీకి చెందిన ప్రముఖ కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలను మైక్ ఫోర్డ్హామ్ పర్యవేక్షించనున్నారు.
మొత్తంగా ఈ కొత్త విధానం.. అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి స్కోర్లను అనుసంధానించే ప్రత్యేక విధానంతో ‘టెస్ట్ ట్వంటీ’ క్రికెట్ ప్రపంచంలో కొత్త ప్రయోగంగా మారనుంది. యువ మహిళా, పురుష క్రికెటర్లను ఒకే పోటీ వేదికపైకి తీసుకురావడం ద్వారా క్రికెట్లో సరికొత్త ఫార్మాట్‌కు ఈ టోర్నీ నాంది పలకనుంది.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?