Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
- కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం..
- సాధారణం కంటే ఆరు నెలల ముందుగానే దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangameswara Temple: అలంపూర్ జోగులాంబ, శ్రీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మ, అమరావతి అమరేశ్వరుడు, మట్టంపల్లి నరసింహస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు.. ఇలా ఎందరో దేవతలు కృష్ణా నది ఒడ్డున కొలువై పూజలు అందుకుంటున్నారు. కానీ కర్నూలు జిల్లాలోని సప్త నదుల సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరుడి పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా నది నీటిలో పూర్తిగా మునిగి తేలే ఈ స్వామి.. సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే ఈసారి ఊహించని రీతిలో స్వామివారు చాలా ముందుగానే నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద నీరు చేరలేదు. ప్రతి వర్షాకాలంలో శ్రీశైలం జలాశయం నిండి గేట్లు ఎత్తడం, పాతాళగంగ ఉరకలెత్తడం ఆనవాయితీగా వచ్చేది. కానీ ఈ సీజన్లో కనీసం ఒక్కసారి కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి రాలేదు. రోజురోజుకూ ప్రాజెక్టులో నీటిమట్టం పాతాళానికి పడిపోతుండటంతో, మొన్నటివరకు నీటిలో మునిగి ఉన్న సంగమేశ్వరుని ఆలయం చాలా వేగంగా ఇప్పుడు బయటపడుతోంది. సాధారణంగా నదీ ప్రవాహం జోరుగా ఉండే ఏళ్లలో సంగమేశ్వర ఆలయం ఉగాది పండుగ సమయానికి బయటపడుతుంటుంది. కానీ ఈసారి వర్షాలు లేక నీటి నిల్వలు తగ్గిపోవడంతో, ఏకంగా ఆరు నెలల ముందే అంటే దసరా పండుగ నాటికే ఆలయం దాదాపు నీటి నుంచి బయట పడుతోంది. ఈ నేపథ్యంలో దసరా పర్వదినం నాడు స్వామివారికి తొలి పూజలు నిర్వహించేందుకు అర్చకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
మరోవైపు ఆరు నెలల ముందే సంగమేశ్వరాలయం బయటపడటం భక్తులకు ఆధ్యాత్మికంగా ఆనందం కలిగించే విషయమే అయినా, వెనుక తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే ఆందోళన మాత్రం భయపెడుతోంది. రానున్న రోజుల్లో సాగునీటికే కాక తాగే నీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటికే అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఆలయం ఇంత ముందుగా బయటకు రావడం రాబోయే తీవ్ర కరవు పరిస్థితులకు సంకేతమని స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
The historic Sangameshwara Temple near Somashila in Kollapur mandal, Nagarkurnool district, has emerged from the Krishna River as water levels receded.
Usually visible only during summer, the temple has surfaced earlier this year. Locals say it is happening after nearly 25 years.
The temple’s unique feature: it remains submerged in the Krishna River for about 8 months of the year and stays above water for around 4 months.
A remarkable glimpse of history emerging from the river! 🙏🛕
— Naveen Reddy (@navin_ankampali) October 7, 2026
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!