Ponnam Prabhakar: గీతన్న.. నేతన్న వేరుకాదు.. కవచంలా అండగా నేనుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: గీతన్న.. నేతన్నా.. వేరు కాదు మీకు అండగా ఉక్కు కవచంలా ఉండే బాధ్యత నాది అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ కష్టం నా కష్టంగా భావించి మీకు అండగా ఉంటా అన్నారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరారని తెలిపారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యత తో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరఫున పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపట్టండి అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు.
Read also: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
Also Read
ప్రాజెక్టులో పై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీరు అధికారం నుండి దిగేనాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి నిల్వలు పై చర్చిద్దామన్నారు. ఈరోజు తాగు ,సాగు నీటికి వాటిని ఎలా వాడమో స్పష్టంగా చెప్పడానికి ,చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కరువు కాంగ్రెస్ తెచ్చింది అంటే మీరు అనుభవజ్ఞులు ..ఇలా అర్ధం లేకుండా మాట్లాడడం సరికాదని తెలిపారు. కరువుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణం కాదన్నారు. మీరు రాజకీయంగా నిజంగా బీజేపీ తో లేనట్లయితే తెలంగాణ ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలను కాపాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. మీరు రండి కలిసి వెళదామన్నారు.
Read also: UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగినటువంటి అనేక సంఘటనలు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మీరు కూడా రావలసిందిగా కోరుతున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడని తెలిపారు. రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నాడన్నారు. మీరు కూడా రండి దీక్ష గల్లీలో కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర చేయాలని తెలిపారు. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు తెలంగాణ రైతన్న ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యలేదు మీరు ఎప్పుడు అడగలేదన్నారు.
Read also: Nayanatara : అర్ధరాత్రి రోడ్డు మీద నయనతార ఏం చేసిందో చూశారా?.. వీడియో వైరల్..
మీకు జాతీయ ప్రాజెక్టు అడిగే ధైర్యం కూడా లేదన్నారు. రైతుల ప్రయోజనాల గురించి మీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణ ప్రయోజనాలను నరేంద్ర మోడీ దగ్గర అడుగుదామన్నారు. మాకు కేంద్రంతో కొట్లాడి ఆలోచన లేదు ఎటువంటి భేషాజాలం లేదు కేంద్రం సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మధ్యవర్తిగా అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మీరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మిగతా నాయకత్వం ముందుకు రండి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృశ్యా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు. కేసీఆర్ పర్యటన చేసుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపారు.
Read also: Nama Nageswara Rao: కాంగ్రెస్ పనితీరు ప్రజలకు వంద రోజుల్లోనే అర్థమైంది..!
నియంతృత్వంగా ఎక్కడవి వ్యవహరించడం లేదు స్వేచ్ఛగా తిరగవచ్చన్నారు. మా అధికారులు కూడా మీకు సహకరిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్న మీరు పొలాల్లోకి వెళ్లి అక్కడ ఇక్కడ ఎండిపోయిన వాటిని కోసుకొచ్చి రోడ్లమీద వేసి రాజకీయ నాయకుడు హోదాకు తగిన విధంగా బిహేవ్ చేయడం లేదన్నారు. రైతులను ఆదుకునే ఆలోచన ఉంటే కేంద్రం దగ్గరికి వెళ్దాం కేంద్రంతో కొట్లాడి ప్రకృతి వైపరీత్యం కింద కరువుకు సంబంధించి నిధులు తెచ్చుకుందాం అందుకు సహకరించాలని కోరుతున్నా అని తెలిపారు. మాజీమంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ నేతన్నల మీద కాంగ్రెస్ కి ఎందుకు ఇంత కక్ష అంటున్నారని తెలిపారు. 3 నెలల్లో మేము ఎం కక్ష చేసాం కేటీఆర్ అన్నారు.
Read also: Mallikarjun Kharge: భయపడే నేత దేశానికి మంచి చేయలేరు: మల్లికార్జున ఖర్గే
మీరు గతంలో బతుకమ్మ చీరల పెండింగ్ పైసలు ఇయ్యక వాళ్ళు ఇబ్బంది పడుతుంది మీరు చేసిన పాపమే కదా? అన్నారు. వాళ్ళకి 24×7 ఉపాధి ఉండే విధంగా టేస్కో ని పటిష్టం చేస్తూ రాష్ట్రంలో అవసరమున్న ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నామన్నారు. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ చట్రంలో పడకండన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పాత బకాయిలు ఉన్నప్పటికి మా ప్రభుత్వం మీ పేమెంట్ చేస్తామన్నారు. బతుకమ్మ చీరల పేరు మీద కొంత మంది బినామీలకూ మాత్రమే లబ్ది జరిగిందనె ఆరోపణలు ఉన్నాయ్.. బతుకమ్మ చీరల కంటే ఎక్కువగా కార్మికునికి ,యజమానికి పని ఉండే విధంగా కాపాడే బాధ్యత మాదన్నారు. 3 నెలల్లో మేము మొత్తం వస్త్ర పరిశ్రమ ముంచేసినట్టు మాట్లాడితే మీకు తగదన్నారు. మీకు ఏమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ జిల్లా మంత్రి గా మీకు సహకరించడానికి నేను ఉన్నా అని తెలిపారు.
Collector Dilli Rao : నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టాం
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?