Nama Nageswara Rao: వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం నామా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ప్రకటనలతో అధికారం చేపట్టిందన్నారు. మోసపూరిత మాటలకు రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి అవి అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, పార్టీ కార్యకర్తలు బాధపడవద్దన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే రోజులన్నారు.
Read also: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
రాబోయే పార్లమెంటు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ వానిని వినిపిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గాలకతీతంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో జిల్లాలో సాగునీరు తాగునీరు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి సమస్యలు పట్టించుకునే నాధుడే లేడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రైతులను, పేదలను ఆదుకోవాలన్నారు. ఆర్ఎస్ పార్టీ జాతీయ నేత కేసిఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!