ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. మితిమీరిన వేగం, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. 18 సంవత్సరాలలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కానీ వాహనాలు ఇవ్వద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట్ లక్ష్మి అన్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పది చోట్ల 60 రంగులతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో ఉపయోగపడతాయని డీసీపీ వెంకట లక్ష్మి అన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని …ఎవరికైతే 18 సంవత్సరాలు పూర్తవుతాయో అప్పుడే వారికి వాహనాలు ఇవ్వాలన్నారు. వారికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాక వాహనాలు ఇవ్వాలని అంతేకాకుండా స్మార్ట్ ఫోన్స్ ద్వారా పిల్లలు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తపడి అవసరం ఉన్నవారికి స్మార్ట్ ఫోన్ కొనివ్వాలి తప్ప చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఇవ్వకూడదన్నారు. ఎవరైతే మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే కఠినచర్యలు తప్పవన్నారు. అలా వాహనాలు నడిపి యాక్సిడెంట్ చేస్తే వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని డీసీపీ చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు.