Anudeep : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కెవి. పిట్టగోడ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైనా జాతిరత్నాలు సినిమా తన హైప్ పెంచింది. కరోనా సంక్షోభం తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్.. పంచులు.. షోలలో అనుదీప్ మాటలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ మూవీ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ప్రిన్స్ వచ్చింది.
Read Also: Meena : తల్లి నిర్ణయంతో కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్
దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి అనుదీప్ తన మార్క్ చూపించాడంటూ నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా కథానాయికగా నటించింది. తాజాగా ఈ డైరెక్టర్ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ తర్వాత అనుదీప్ తెరకెక్కించే సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓప్రాజెక్ట్ రూపొందించాలని భావిస్తుందట. ఇక ఈ సినిమాను డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అంతేకాకుండా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్.. వెంకటేశ్ కాంబోలో రాబోయే సినిమాను అనుదీప్ తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ కూడా రాబోతుందట.
Read Also:Adah Sharma: దేవుడా.. అందానికే ‘హార్ట్ ఎటాక్’ తెప్పిస్తుందే..
ప్రస్తుతం రామ్ పోతినేని.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రామ్, అనుదీప్ కాంబోలో రాబోతున్న సినిమా మరో జాతిరత్నంగా ఉంటుందా అంటున్నారు ఫ్యాన్స్. తనకు అవకాశం వస్తే షారూఖ్ ఖాన్ తో సినిమా తీయాలని ఉందంటూ అనుదీప్ మనసులో మాట బయటపెట్టారు.