CM Revanth Reddy : పాశమైలారం ఘటనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
- సిగాచిని పరిశీలించిన అనంతరం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
- పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
- పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరా అని ప్రశ్నించిన సీఎం
- పరిశ్రమను తనిఖీ చేశారా అని ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
- జా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై సీఎం అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ అనుమతులు ఇచ్చే సమయంలో పరిశీలన జరిగిందా లేదా?, పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరూ, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ పరిశ్రమను తనిఖీ చేశారా వంటి కీలకమైన ప్రశ్నలు అడిగారు. అనంతరం ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని, ఇప్పటికే పరిశీలించిన అధికారులతో కాకుండా కొత్త బృందంతో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ .. నితిన్‌కు ఈసారైన హిట్ దక్కేనా..!
సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద నివారణకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ప్రతి శాఖ సమన్వయంతో స్పందించాలి అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, రియాక్టర్ల పేలుడు ఘటనపై పూర్తి నివేదికను సత్వరంగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు మానవత్వంతో సహకరించాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యం మీద ఉందని సీఎం స్పష్టం చేశారు. అంతేగాక, ఘటనలో గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, బాడీలను ట్రేస్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలన్న సీఎం రేవంత్.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలన్నారు. అయితే.. క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామన్న ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది.
పరిశ్రమను తనిఖీ చేసిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు.
Tamil Nadu: శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!