Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ .. నితిన్‌కు ఈసారైన హిట్ దక్కేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా కనిపించనున్నాడు. ఆమె ఆపదలో ఉన్నట్లు తెలిసిన క్షణం నుంచే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ కథలోని అసలు హైపాయింట్ అని ట్రైలర్ స్పష్టమవుతోంది.
Also Read: Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
విలన్‌గా సౌరబ్ సచ్‌దేవా అగ్రెసివ్ షేడ్స్‌తో కనిపించి సినిమాకు మరింత టెన్షన్‌ను తెస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, క్రూరత ప్రేక్షకులపై గట్టిగా ప్రభావం చూపేలా ఉంది. ఇక మరో కీలకంగా చెప్పుకోవాల్సింది అజనీష్ లోకనాథ్ సంగీతం. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. థియేటర్‌లో ఈ స్కోర్ ప్రేక్షకులను ఒక ఎమోషనల్ ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుందని అనిపిస్తోంది. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కాగా జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా, నితిన్‌కి మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందిస్తుందో లేదో చూడాల్సిందే!
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!