Chemical Factory Blast: మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జేపీ పరిశ్రమల నగరంలోని లింబాని సాల్ట్ ఇండస్ట్రీస్ కంపెనీలో కెమికల్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్‌లో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ పరిసరాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గాయపడిన కార్మికులను సమీపంలోని ఢవలే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ…
CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై…
CM Revanth Reddy : పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల ధాటికి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. Illegal relationships : దాంపత్య బంధానికి పెనుభూతులవుతున్న వివాహేతర సంబంధాలు..…
Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ…
Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని…