విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కార్మిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని తెలిపారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Also Read:CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు..
నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలన్నారు. ఏటీసీలలో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సిబ్బంది నియామకంపై అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.