విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కార్మిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని తెలిపారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని అధికారులకు…
రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించే విధంగా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తమ హయాంలో ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
CM Revanth Reddy: ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం కసరత్ చేస్తుంది. ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.