CM Revanth Reddy : వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
- తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి
- హడ్కో ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కులశ్రేష్ఠ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం హడ్కో ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూర్, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై ముఖ్యమంత్రి… హడ్కో ఛైర్మన్‌ల మధ్య చర్చ సాగింది. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్ రీకన్‌స్ట్రక్చన్) అంశాన్ని సీఎం హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
AIDS Day : హెచ్‌ఐవీ నిజంగా నయం అవుతుందా.? ఆశాజనకమే.. కానీ..
Also Read
ఈ అంశంపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హడ్కో ఛైర్మన్ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా ఛైర్మన్ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని హడ్కో ఛైర్మన్‌ను సీఎం ఆహ్వానించారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కే.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, హడ్కో రీజినల్ చీఫ్ పి.సుభాష్ రెడ్డి, హడ్కో జాయింట్ జనరల్ మేనేజర్లు ఆశీష్ గుండాల, సయ్యద్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?