CM Revanth Reddy: డిసెంబర్ 7న తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన బ్రాండ్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎలాంటి తేడాలు లేకుండా ఇప్పుడున్నట్లే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చకు కొనసాగింపుగా శుక్రవారం (డిసెంబర్ 8) సచివాలయంలో ఆ శాఖ అధికారులతో రేవంత్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుత విధానాలనే కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షలో ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్‌పై అధికారులను సీఎం పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read also: WhatsApp New Feature: వాట్సాప్ లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?
ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో అందించాల్సిన వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలన్నది ప్రభుత్వ విధానమని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు పూర్తి సహకారం అందించాలని ఆ శాఖకు సూచించారు. ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్ రావు హాజరుకావాలని కేబినెట్ భేటీలో విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేసినా.. సమీక్షా సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు సీఎంవో నుంచి కానీ, ఆ శాఖ అధికారుల నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ సమాచారం అందితే ఎందుకు హాజరు కావడం లేదని ప్రభాకర్ రావు నిలదీశారు. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
Prabhas: ప్రమోషన్స్ చెయ్యకుండానే సలార్ వచ్చేలా ఉన్నాడు…