పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి స్టార్ హీరోలు… తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యగానే ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నారు. షారుఖ్ లాంటి హీరో చెన్నైలో జవాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేసాడు అంటేనే పాన్ ఇండియా సినిమాకి ఇండియా మొత్తం ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం ఎలా తిరగాలో వీళ్లకి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ హీరోలందరూ రిలీజ్ డేట్ కి నెల రోజుల ముందు నుంచే ఇండియా మొత్తం తిరుగుతూ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు… ఒక్క ప్రభాస్ తప్ప… ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ మాత్రమే తన సినిమా రెండు వారాల్లో రిలీజ్ ఉన్నా కూడా ప్రమోషన్స్ చెయ్యట్లేదు.
డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజ్ ఉంది… భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ప్రభాస్ ఇంకా ప్రమోట్ చెయ్యలేదు. మోకాలు సర్జరీ తర్వాత రెస్ట్ లో ఉన్న ప్రభాస్ ఒక్క ఇంటర్వ్యూ, ఒక ప్రమోషనల్ కంటెంట్ ని బయటకి ఇవ్వలేదు. హిందీ పక్కన పెట్టడం కనీసం తెలుగులో కూడా సలార్ ని ప్రమోట్ చెయ్యలేదు. టీజర్, ట్రైలర్ లు మాత్రమే సలార్ సినిమాపై అంచనాలు పెంచాయి. కాంబినేషన్ పైన హైప్ ఉండడంతో, అదే సలార్ సినిమాకి బిగ్గెస్ట్ పబ్లిసిటీ అయ్యింది. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ చెయ్యకుండా ఇప్పటికిప్పుడు సలార్ సినిమాని రిలీజ్ చేసినా కూడా బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ మరింత ఎక్కువ కలెక్షన్స్ ని రాబడతాడు. ఈ కారణంగా హోంబలే ఫిల్మ్స్ కాస్త రిలాక్స్ గా ఉండొచ్చు. అయితే రిలీజ్ కి ముందు ప్రభాస్ సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాత్రం పాల్గొంటాడు. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ.