Telangana Ministers Portfolios: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు? అనే చర్చ అప్పటి నుంచి సాగుతూనే ఉందే.. ఇదిగో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని లిస్ట్‌లు హల్‌చల్ చేశాయి..
ఫైనల్‌గా కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్‌రెడ్డి.. నిన్న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశమైన రేవంత్‌రెడ్డి.. ఎవరికి ? ఏ శాఖ కేటాయించాలి అనే దానిపై చర్చించి వచ్చారు.. అయితే, మంత్రులకు శాఖలు ఈ శాఖలు కేటాయించారు.
మంత్రులు-శాఖల కేటాయింపు ఇలా ఉంది:
* రేవంత్‌రెడ్డి-ముఖ్యమంత్రి
* భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ
* ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాలు
* దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
* కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ
* పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం
* పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
* కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
* సీతక్క – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం
* తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్
* శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
* జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ పర్యాటకశాఖ
ఇక, త్వరలోనే మిగతా మంత్రుల ప్రమాణస్వీకారంతో పాటు.. శాఖల కేటాయింపు కూడా ఉంటుందని తెలుస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఎవరికీ మంత్రి పదవులు కేటాయించలేదు.. అయితే, కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి.. మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.. అయితే, దీనికి రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.