CM Revanth Reddy: డిసెంబర్ 7న తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన బ్రాండ్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, గత రెండు రోజులుగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది.
Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేసి, సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు. నిన్నటి నుంచి హైకమాండ్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై తలమునకలై ఉంది.