CM KCR Wishes Adivasis: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. సీఎం శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Wishes Adivasis: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ముహర్రం సందర్భంగా తెలంగాణ సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఆదివాసీయులందరికి ప్రభుత్వం అండగా వుంటుందని పేర్కొన్నారు. మానవీయ సంబంధాలకు మమతాను రాగాలకు కల్మశం లేని ఆదివాసీలు ప్రతీకలని సీఎం వ్యాఖ్యానించారు. ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం కోసం స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేసారు. మా తండాలో మా రాజ్యం అనే ఆదివాసి గిరిజన ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.
read also: National Flags Distribution: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ఈ నేపథ్యంలో.. గిరిజనులకు గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేడ్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాగా.. గిరిజన గూడాలకు, తండాలకూ విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా.. కుమురం భీం స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీ గోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు.
భాగ్యనగరంలోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. అంతేకాదు, ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ.. గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారి వ్యాపారాభివృద్ధికీ ప్రభుత్వం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఈరోజు మస్లీములు జరుపుకుంటున్న బీబీకా ఆలం (మొహర్రం) పండుగ సందర్భంగా.. సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!