CM KCR: సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనులు, కరివెన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులు, ఉదండాపూర్ నుంచి తాగునీటి తరలింపు పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు.
KTR: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి జిల్లా మీద ప్రేమ ఉంటే వెంటనే తీర్మానించాలని డిమాండ్ చేశారు. నారాయణ పేట స్టేడియం గ్రౌండ్ లో ప్రగతి నివేదన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
జల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో.. ఇవాళ 6 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా…
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన…