CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసేందుకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రెస్య్కూ టీంలు, ఎన్ఢీఆర్ఎఫ్ టీములు అవసరమైతే హెలికాప్టర్లను వినియోగించాలని ఆదేశించారు.
వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసమైతే తప్పితే తప్పా బయటకు రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు.
Also Read
Read Also: BJP: ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు
జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో(కాజ్ వేలు) ప్రమాద హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే చర్యలను చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, పక్క రాష్ట్రాల్లో నిండుతున్న బ్యారేజీల వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చూడాలన్నారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజమాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితులు అదుపులోనే అధికారులు సీఎంకు తెలిపారు.
తాజావార్తలు
-
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
-
Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్‌గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
ట్రెండింగ్
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!