CM KCR Kondagattu Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి, 9:05 గంటలకు బేగంటపే విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కేసీఆర్ నాచుపల్లిలోని జేఎన్టీయూకు చేరుకుంటారు. అటు నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకొని.. ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు కొండపైనే కేసీఆర్ గడపనున్నారు. బడ్జెట్‌లో కొండగట్టు అంజయనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయన దేవాలయ దేవాలయ పునర్నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. దేవాలయ అభివృద్ధికి కావాల్సిన సలహా సూచనలు చేయనున్నారు.
Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక
యాదాద్రి ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఈ దేవాలయాన్ని పరిశీలించి, నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. ఈ నివేదికపై రేపు అధికారులతో కలిసి సీఎం సమీక్ష చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే రవిశంకర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కొండగట్టకు కేసీఆర్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఆయన.. కొండగట్టు దేవాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారన్నారు. కాగా.. కొండగట్టు ఆలయానికి సంబందించిన పూర్తి వివరాలను రేపు సీఎం కేసీఆర్ తెలియజేయనున్నారు. నిజానికి.. ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీనే (ఈరోజు) కొండగట్టును కేసీఆర్ సందర్శించాల్సి ఉంది. అయితే.. కొండగట్టులో మంగళవారం రోజున భక్తుల సందడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నందున, ఫిబ్రవరి 15ని కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో మరో పుణ్యక్షేత్రమైన కొండగట్టును అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దే మహా యజ్ఞానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
Jagga Reddy: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదు.. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్