Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఇటీవల అత్యాచార వార్తల్లో కొంత స్తబ్ధుగా ఉన్న న్యూ ఢిల్లీ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. షాపింగ్ మాల్ సెల్లార్‌లో కారులో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తుషార్ శర్మ అనే వ్యక్తి తనకు మత్తు మంది ఇచ్చి కారులోనే అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. ఆన్‌లైన్‌లో జాబ్ ట్రయల్స్ చేస్తున్న ఆమెకు తుషార్ పరిచయమయ్యాడు. ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూ ఉంది రావాలంటూ సమాచారం అందించాడు. అతడు చెప్పినట్టే ఆమె తన డాక్యుమెంట్స్ తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు అక్కడకు చేరుకుంది.
Read Also: Syria Border : పుష్కరం తర్వాత తెరుచుకున్న సిరియా సరిహద్దులు
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ఈ క్రమంలో నిందితుడు ఆమెను కారులో ఎక్కించుకుని బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అతడిచ్చిన నీళ్లు తాగాక తాను స్పృహ కోల్పోయానని చెప్పింది. ఆ తరువాత.. తుషార్ తనను బలవంతంగా కారులోకి తోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడటం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!