CM KCR: UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకులు సాధించి సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు…వీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇక సివిల్స్‌లో తృతీయ ర్యాంక్ సాధించిన ఉమా హారతిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకున్న అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. ఉమా హారతి విజయవంతం చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Read also: Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన
UPSC మే 23న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచింది. అదే సమయంలో బీహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానంలో నిలిచారు. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో, అస్సాంకు చెందిన మయూర్ హజారికా ఐదో స్థానంలో, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరో స్థానంలో నిలిచారు. UPSC 2022 పరీక్ష ఫలితాలు ఈరోజు (మే 23) విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. UPSC 2022లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 345 మంది జనరల్ కోటా నుండి, 99 మంది EWS నుండి, 263 మంది OBC నుండి, 154 మంది SC నుండి మరియు 72 మంది ST వర్గం నుండి ఎంపికయ్యారు. ఈ సివిల్స్ లో ఇషితా కిషోర్ మొదటి ర్యాంక్ సాధించింది. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్., స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో సత్తా చాటారు. ఇక మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తెలంగాణకు చెందినవారు.