ఐపీఎస్ అధికారి కుమార్తె ఐఏఎస్ అయ్యారు. ఆ కుమార్తె పేరు ఉమాహారతి. ఆమె తండ్రి ఎన్. వెంకటేశ్వర్లు ఎస్పీగా పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఉమాహారతి అయిదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ లో మెరిశారు.
CM KCR: UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది.