Bhatti Vikramarka: దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే కేసులు, వాళ్ళు చెప్పితే మాట్లాడాలి, ప్రచారం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారత్ రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి ఎలాంటి అలజడి లేకుండా అధికార బదిలీ అయింది అంటే రాజ్యాంగం వల్లే అని తెలిపారు భట్టి. సామాజికంగా అందరికి సమాన హక్కులు ఇచ్చిందని అన్నారు. 20 సూత్రాల అమలు, బ్యాంకుల జాతీయికరణ కాంగ్రెస్ ఆమలు చేసిందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనువాదా శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందని మండిపడ్డారు. 8 సంవత్సరాల బీజేపీ పాలన లో మాములు వ్యాపారవేత్త ప్రపంచంలోనే కుబేరుడుగా మారుతున్నాడు ఆరోపించారు.
Read also: Nadendla Manohar: ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. పొత్తులపై అప్పుడే నిర్ణయం..!
ఆర్థిక సమానత్వం లేకుండా ఒక్కరికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పేలా ప్రజలోకి వెళ్ళాలని భట్టి విక్రమార్క తెలిపారు. రాజకీయ సమనత్వం కాంగ్రెస్ అమలు చేస్తూ వచ్చిందని అన్నారు. ఇప్పుడు బడుగు బలహీన, బహుజన అవకాశాలు కొల్లగొట్టి కొంతమందికె కట్టబెడుతున్నారని తెలిపారు. రాజకీయ సమానత్వంలో అత్యంత పేదవాడు సైతం ఎన్నికల్లో గెలిచేలా ఉండాలన్నారు. దోచుకున్న సొమ్ముతో వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు వాళ్ళు చెప్పితే మాట్లాడాలి ప్రచారం చేయాలని నిప్పులు చెరిగారు. ఈడీ, సీబీఐ,ఎసిబి లతో దాడులు చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ రక్షణే.. దేశ రక్షణ.. అని, మూల సిద్ధాంతాలకు కాంగ్రెస్ మరిచిపోదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Cat In Passengers Suitcase: కంగుతిన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికుడి సూట్ కేసులో..