ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చెయ్యాలి.. మా పార్టీ నినాదం అదే అన్నారు జనసేనా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిగతా రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లాలా లేదన్నది సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం అన్నారు.. రాష్ట్రంలో చాలా సమస్యలు తాండవిస్తున్నాయి…. ప్రతి చోటా మాకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జగనన్న కాలనీలు అవినీతిమయం.. సోషల్ ఆడిట్ చేసి ప్రజలకు వివరిస్తామన్న ఆయన.. కట్టకపోతే ఇచ్చిన పట్టాలు లాక్కుంటున్నారు… బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. బటన్ నొక్కాను డబ్బులు పడిపోతున్నాయని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.. క్షేత్ర స్థాయిలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తించడంలేదని విమర్శించారు.
Read Also: YV Subba Reddy: నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే మార్పులు..
మత్స్యలేషం గ్రామంలో ఓ యువకుడు వలసలుపై ప్రస్తావించాడు.. సుమారు ఆరువేల మంది ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.. మత్స్యకార భరోస రాలేదని మత్స్యకారులు గగ్గోలపెడతున్నారు. కారణాలు చూస్తే అన్నీ తప్పుల తడక.. ఓ కుటుంబానికి 107 ఎకరాల భూముందని రికార్డులలో చూపిస్తుందట అని ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టు నిర్వాసితులు ఇబ్బందలు పడుతున్నారు.. మైనింగ్ మాఫియా నడుస్తుంది.. వనరులను దోచుకుంటున్నారు.. సాలూరులో ఇసులు అక్రమంగా తరలిపోతుంది. పర్యాటకంగా కూడ అడ్డుకుంటుమ్నారు… తాటిపూడి రిజర్వాయర్ పైకి పర్యాకులు రావద్దని బోర్డులు పెడుతున్నారు.. ఎక్కడో బోటు ప్రమాదం జరిగిందని ఇక్కడ ఆపేయడంకాదు.. పొరపాటులను సరిదిద్దే కోవాలని సలహా ఇచ్చారు. అర్హత ఉన్న చాలామంది గిరిజనులకు, వికలాంగులకు ఇంకా పెన్షన్ ఇవ్వకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.